Miryalaguda: గణేష్ నిమజ్జనం కోసం సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల!

Miryalaguda: మిర్యాలగూడ వేములపల్లి మండలంలో గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల. ఘాట్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 23 Sept 2026 12:44 PM IST
Miryalaguda
X

Miryalaguda: గణేష్ నిమజ్జనం కోసం సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల!

Miryalaguda: వేములపల్లి మండలంలో గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎడమ కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో ఘాట్ వద్ద నిమజ్జనం చేసిన గణేష్ విగ్రహాలు సగం నీటిలోనే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు భారీగా నిమజ్జనాలు జరగనున్నందున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

వేములపల్లి మండలంలోని ఎడమ కాలువ నిమజ్జన ఘాట్ వద్ద గణేష్ విగ్రహాలు సగం నీటిలోనే దర్శనమిస్తున్నాయి. కాలువలో తగినంత నీరు లేకపోవడంతో నిమజ్జనాలు ఇబ్బందికరంగా మారాయి.

ఈరోజు పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీస్ బందోబస్తు గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేములపల్లి నిమజ్జన ఘాట్ వద్ద సుమారు 75 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రవి తెలిపారు. అదేవిధంగా వాడపల్లి వద్ద కూడా 30 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిమజ్జనాలకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA