Nalgonda: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు: మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: నల్గొండ పట్టణంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పత్రాలను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంపిణీ చేసి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Saleem, Nalgonda
Published on: 13 Nov 2026 5:28 PM IST
Nalgonda
X

Nalgonda: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. నిరుపేదల ఆర్థిక భరోసాకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda