Kethepally: కేతేపల్లి మండలంలో చేయూత పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Kethepally: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో అర్హులైన పేదలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 17 Nov 2026 11:45 AM IST
Kethepally
X

Kethepally: కేతేపల్లి మండలంలో చేయూత పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Kethepally: కేతేపల్లి మండలానికి మంజూరైన నూతన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేముల వీరేశం మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విడతలో నకిరేకల్ నియోజకవర్గానికి మొత్తం 5,356 పింఛన్లు మంజూరు కాగా, కేతేపల్లి మండలానికి 802 పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.

చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఆర్థిక అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధులకు సైతం త్వరలో పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండల అధికారులు, నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL