Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఉరివేసుకుని ఆత్మహత్య!

Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మునుగోడు మండలానికి చెందిన మమత (27) అనే బాలింత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Saleem, Nalgonda
Published on: 12 Aug 2026 9:00 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఉరివేసుకుని ఆత్మహత్య!

Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్యకు పాల్పడింది. మునుగోడు మండలం చీకటిమామిడికి చెందిన మమత(27) 8 రోజుల క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా, మగబిడ్డకు జన్మనిచ్చింది.

తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన ఆమె పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని మృతి చెందింది. మమతకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story