Nalgonda: పోలీస్ క్వార్టర్స్‌లో విషాదం..మహిళా హోంగార్డు దారుణ హత్య!
Nalgonda: నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు.
Nalgonda: పోలీస్ క్వార్టర్స్‌లో విషాదం..మహిళా హోంగార్డు దారుణ హత్య!
Nalgonda: జిల్లా కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మెహబూబ్ బీ (35) దారుణ హత్యకు గురయ్యారు.
రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న నివాసంలో భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవతో, భర్త సతీష్ ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వీరు కులాంతర వివాహం చేసుకోగా, కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు నడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు గల పూర్తి కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.




