Suryapet: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం మద్దిరాలలో మహిళల ధర్నా!

Suryapet: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అర్హత ఉన్నా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రాలేదంటూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 5 Oct 2026 3:46 PM IST
Suryapet
X

Suryapet: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం మద్దిరాలలో మహిళల ధర్నా!

Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: మద్దిరాల మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అర్హత ఉన్న తమకు ఇళ్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ మద్దిరాల గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మహిళలు ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం నిజమైన సర్వే నిర్వహించి, అర్హత కలిగిన పేదలను గుర్తించి ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లు ఎంపికలో లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించి, అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని మహిళలు అధికారులను కోరారు. తమ సమస్యను పరిశీలించి తక్షణమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy