Alair: పోలీసుల ఆకస్మిక కార్డన్ సెర్చ్ భారీగా వాహనాలు సీజ్!

Alair: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పోలీసుల కార్డన్ సెర్చ్. డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో 36 వాహనాలు, 50 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం.

MAHENDER, ALERU
Published on: 24 July 2026 8:10 AM IST
Alair
X

Alair: పోలీసుల ఆకస్మిక కార్డన్ సెర్చ్ భారీగా వాహనాలు సీజ్!

Alair: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మ గుడి, భరత్ నగర్, శాంతినగర్ ప్రాంతాలలో ఉదయం 5:30 గంటలకు పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ కార్డెన్ సర్చ్ లో సరైన పత్రాలు, అనుమతులు లేని 31ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అలాగే 8 గ్యాస్ సిలిండర్లు,50 లీటర్ల అక్రమ మద్యం (లిక్కర్)ను సీజ్ చేశారు.డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 6 మంది ఇన్‌స్పెక్టర్లు,15 మంది ఎస్‌ఐలు,130 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే సమాచారంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు.అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు వాహనాలు,నివాస ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు.

MAHENDER, ALERU

MAHENDER, ALERU

Next Story