Yadadri: యాదాద్రి జిల్లాలో కుల వివక్ష.. బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ!
Yadadri: యాదాద్రి జిల్లా టి.రేపాకలో బతుకమ్మ ఆడేటప్పుడు కుల వివక్ష చూపారంటూ దళిత మహిళలు ఆత్మకూరు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు.
Yadadri: యాదాద్రి జిల్లాలో కుల వివక్ష.. బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ!
Yadadri: ఏఐ టెక్నాలజీ కాలంలోనూ కుల వివక్షత జాడ్యo మాత్రం పోవడం లేదు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం టి.రేపాక గ్రామంలో బతుకమ్మ పండుగ వేళ రెడ్డి కులస్తులు దళితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బతుకమ్మ పండుగ రోజున శనివారం సాయంత్రం గ్రామంలో బండపై బతుకమ్మ ఆడుతుండగా రెడ్డి సామాజిక వర్గం మహిళలు దళితులు మా పక్కన బతుకమ్మలు పెట్టి ఎలా ఆడతారని ఆ మహిళలు బతుకమ్మలను తీసుకొని వెళ్లిపోయారని దళితులు ఆరోపించారు.
కుల వివక్షత పై ఆవేదన వ్యక్తం చేసిన దళితులు ఆత్మకూర్యం పోలీస్ స్టేషన్ ఎదుట తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలో మాతో అన్ని రకాల పనులు చేయించుకుంటూ బతుకమ్మ ఆడితేనే మైల పడతారా అంటూ దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు ఘటనపై ఆత్మకూరు ఎస్సైకి ఫిర్యాదు చేశారు.




