Yadadri: రామన్నపేటలో భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా రట్టు పోలీసులు దాడి!
Yadadri: యాదాద్రి జిల్లా రామన్నపేటలో కల్తీ అల్లం పేస్ట్ దందాను పోలీసులు భగ్నం చేశారు. వాహన తనిఖీల ఆధారంగా కీసర తయారీ కేంద్రంపై దాడి చేసి సామగ్రి జప్తు చేశారు.
Yadadri: రామన్నపేటలో భారీ కల్తీ అల్లం పేస్ట్ దందా రట్టు పోలీసులు దాడి!
యాదాద్రి భువనగిరి జిల్లా:
రామన్నపేటలో భారీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి..
భారీగా అల్లం డబ్బాలు స్వాధీనం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల బండారం యాదాద్రి భువనగిరి జిల్లాలో బట్టబయలైంది. రామన్నపేట కేంద్రంగా సాగుతున్న భారీ కల్తీ అల్లం పేస్ట్ దందాను రామన్నపేట ఎస్సై సతీష్ భగ్నం చేశారు.రామన్నపేట సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా..ఎలాంటి అనుమతులు లేకుండా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. అందులో భారీ ఎత్తున కల్తీ అల్లం పేస్ట్ డబ్బాలు బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కీసరలోని ప్రధాన తయారీ యూనిట్‌పై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించి..భారీగా ముడి పదార్థాలు, యంత్రాలు, తయారైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని, ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా ఆడుకుంటే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు తీసే ఈ కల్తీ దందాపై పోలీసుల చొరవను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.




