Suryapet: కోదాడలో 100వ ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు!

Suryapet: ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కోదాడలో నిర్వహించిన 100వ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పోలీసులు పాల్గొని సైక్లింగ్‌పై అవగాహన కల్పించారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 29 Nov 2026 12:07 PM IST
Suryapet
X

Suryapet: కోదాడలో 100వ ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు!

Suryapet: ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహిస్తున్న సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం 100వ ఎడిషన్‌ను ఆదివారం కోదాడ పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ టౌన్, రూరల్, మునగాల పోలీస్ స్టేషన్ల సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి యువత చదువు, ఉద్యోగాల ఒత్తిడిలో పడి శారీరక వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం, సైక్లింగ్‌ను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సైక్లింగ్‌తో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామంపై ఆసక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది సైతం విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ఆరోగ్యవంతమైన యువతతోనే బలమైన సమాజం నిర్మాణమవుతుందని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD