Gajapati: గజపతి జిల్లాలో ఉత్సాహంగా సాహస సైక్లింగ్ పోటీలు!
Gajapati: గజపతి మహేంద్రగిరి పర్వత శ్రేణుల్లో 23వ జాతీయ మౌంటెయిన్ సైకిల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటుతున్నారు.
Gajapati: గజపతి జిల్లాలో ఉత్సాహంగా సాహస సైక్లింగ్ పోటీలు!
Gajapati: గజపతి జిల్లా రాయగడ సమితి మహేంద్రగిరి పర్వత శ్రేణుల్లో 23వ జాతీయ మౌంటెయిన్ సైకిల్ పోటీలు శుక్రవారం రెండో రోజుకు చేరుకు న్నాయి. కోయిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోటీలకు దేశ నలుమూలల నుంచి సుమారు 36 బృందాలు చేరుకొని కొండలపై సైకిలింగ్ చేశారు. ఈ పోటీల్లో 390 మంది పోటీ పడగా 36 పతకాలు సాధించారు. గజపతి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.




