Illegal Relationship: పంచాయతీలో గర్భవతినంటూ చెప్పిన మహిళ..కారణం ఎవరో తెలిసి మైండ్ బ్లాక్ అయింది..!
Illegal Relationship: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది.
Illegal Relationship: పంచాయతీలో గర్భవతినంటూ చెప్పిన మహిళ..కారణం ఎవరో తెలిసి మైండ్ బ్లాక్ అయింది..!
Pocso Act Case: కుటుంబ బంధాలు, సామాజిక విలువలను పూర్తిగా మంటగలిపేలా ఉత్తరప్రదేశ్‌లో ఒక అత్యంత విచిత్రమైన, సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు తల్లితో సమానమైన అత్త.. మైనర్ అయిన మేనల్లుడిని లొంగదీసుకుని, గత రెండున్నర ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఉదంతం అలీగఢ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పంచాయతీ పెద్దల సమక్షంలో సదరు మహిళ చేసిన ఓ ప్రకటన అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
అలీగఢ్ జిల్లా ఇగ్లాస్ కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె తన సొంత 17 ఏళ్ల మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇష్టం లేకపోయినా బాలుడిని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ రెండున్నర సంవత్సరాలుగా ఈ బంధాన్ని కొనసాగించింది.
ఒకవేళ తన మాట వినకపోతే సమాజంలో పరువు తీస్తానని, తప్పుడు అత్యాచార కేసు పెట్టి జైలుకు పంపిస్తానని ఆ మైనర్‌ను తరచూ బెదిరించేది. భయంతో ఆ బాలుడు ఇన్నాళ్లూ ఈ నరకాన్ని మౌనంగా భరించాడు.
ఇటీవల ఆ మహిళ సదరు మైనర్ బాలుడిపై మరో బాంబు పేల్చింది. తనను పెళ్లి చేసుకుని జీవితాంతం తనతోనే ఉండాలని గొడవ చేయడం మొదలుపెట్టింది. దీంతో తట్టుకోలేకపోయిన ఆ బాలుడు భయంతో ఏడుస్తూ అసలు విషయాన్ని తన తల్లికి వివరించాడు. ఈ దారుణం విన్న బాలుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. విషయం కాస్తా ఊరంతా పొక్కడంతో గ్రామంలో తీవ్ర చర్చకు దారితీసింది.
సమస్యను పరిష్కరించేందుకు పోలీసుల సమక్షంలో గ్రామ పెద్దలు పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భర్త, బంధువులు ఎంత నచ్చజెప్పినా ఆ మహిళ వినలేదు. భర్త ఆమెను క్షమించి తిరిగి కాపురానికి తీసుకెళ్లడానికి సిద్ధపడినా, ఆమె మాత్రం.. నేను నా మేనల్లుడితోనే ఉంటా, అతడినే పెళ్లి చేసుకుంటా అని తెగేసి చెప్పింది.
అంతటితో ఆగకుండా.. తాను ప్రస్తుతం రెండున్నర నెలల గర్భవతినని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ మైనర్ బాలుడే తండ్రి అని అందరి ముందూ బహిరంగంగా ప్రకటించింది. ఈ మాట వినడంతోనే పంచాయతీలో ఉన్నవారంతా నోరెళ్లబెట్టారు.
మహిళ ప్రవర్తనతో విసిగిపోయిన బాధిత బాలుడి తల్లి చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాలుడు మైనర్ కావడంతో పోలీసులు నిందితురాలైన మహిళపై కఠినమైన 'పోక్సో చట్టం'తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. అలాగే బాధిత మైనర్ బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి పంపారు. వరుసకు అత్త అయ్యుండి, మైనర్ అని కూడా చూడకుండా బాలుడి జీవితాన్ని నాశనం చేసిన ఈ మహిళ ఉదంతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.




