Abhijeet Dipke: తిరంగా మార్చ్ వేళ తీవ్ర ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న దిల్లీ పోలీసులు!

Abhijeet Dipke: దిల్లీలో సీజేపీ ‘తిరంగా మార్చ్’ ఉద్రిక్తత. కరోల్‌బాగ్‌లో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బస చేసిన నివాసానికి వెళ్లిన దిల్లీ పోలీసులు.

Arun Chilukuri
Published on: 16 Oct 2026 3:35 PM IST
Abhijeet Dipke
X

Abhijeet Dipke: తిరంగా మార్చ్ వేళ తీవ్ర ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న దిల్లీ పోలీసులు!

Abhijeet Dipke: దేశ రాజధాని దిల్లీలో సీజేపీ (CJP) శుక్రవారం తలపెట్టిన ‘లెహరా దో తిరంగా’ (Lehra Do Tiranga) మార్చ్ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీ ప్రారంభానికి ముందే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బస చేసిన కరోల్‌బాగ్‌లోని ఇంటికి దిల్లీ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ పరిణామంతో రాజధానిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది.

సీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తిరంగా మార్చ్’ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అభిజీత్ దీప్కే బస చేసిన స్థలానికి పోలీసులు వెళ్లారు.

తిరంగా మార్చ్ ప్రారంభానికి ముందే పోలీసులు తనను అదుపులోకి తీసుకునే లేదా గృహ నిర్బంధం చేసే అవకాశం ఉందంటూ అభిజీత్ దీప్కే ఇదివరకే వ్యాఖ్యానించారు.

గురువారమే దిల్లీకి చేరుకున్న అభిజీత్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అనిశ్ గవండేకు చెందిన కరోల్‌బాగ్‌ నివాసంలో బస చేశారు.

సీజేపీ తిరంగా మార్చ్‌ పిలుపుతో దిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను తీవ్రతరం చేశారు. అనుమతులు లేవంటూ ర్యాలీని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.