ACB Raids: హెచ్‌ఎండీఏ సీఈ రవీందర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్
ACB Raids: హెచ్‌ఎండీఏ సీఈ బచ్చు రవీందర్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
ACB Raids: హెచ్‌ఎండీఏ సీఈ రవీందర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్
ACB Raids: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ (CE) బచ్చు రవీందర్ లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ సోదాలు చేపట్టారు. రవీందర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ వచ్చిన విశ్వసనీయ ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగి ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మొత్తం 15 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. మైత్రివనంలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలోని 'సుమధుర టవర్స్'లో గల రవీందర్ స్వగృహంలో తనిఖీలు జరుగుతున్నాయి. రవీందర్‌కు సంబంధించిన సన్నిహితులు, ముఖ్య అనుచరులు, బంధువుల నివాసాల్లోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ రికార్డులను జల్లెడ పడుతున్నారు.
ఉదయం నుంచి సాగుతున్న ఈ సోదాల్లో ఇప్పటికే పలు విలువైన స్థిరాస్తి, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను, బ్యాంక్ లాకర్ల వివరాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రికార్డుల పరిశీలన కొనసాగుతోంది. ఈ సోదాలు మంగళవారం సాయంత్రం వరకు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తనిఖీలు పూర్తిగా ముగిసిన తర్వాత రవీందర్ వద్ద లభ్యమైన అక్రమాస్తుల విలువ, నగదు, బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.




