Paralakhemundi: న్యాయస్థానంలో లొంగిపోయిన విద్యాభారతి పండా

Paralakhemundi: ఏసీఎఫ్‌ఓ సౌమ్య రంజన్ మహాపాత్ర్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు, భార్య బిద్యాభారతి పండా పర్లకీముండి కోర్టులో లొంగిపోగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.

S.Anil, Gajapati Dst
Published on: 3 Nov 2026 9:47 PM IST
Paralakhemundi
X

Paralakhemundi: న్యాయస్థానంలో లొంగిపోయిన విద్యాభారతి పండా

పర్లకీముండి: గజపతి జిల్లా ఏసీఎఫ్ఓ సౌమ్య రంజన్ మహాపాత్ర్ మృతికేసుకు సంబంధించి మృతుడు భార్య బిద్యా భారతి పండా సోమవారం జిల్లా కోర్టులో లొంగిపోయింది. వివరాల్లోకి వెళితే... సౌమ్య రంజన్ మహాపాత్ర్ 2021 లో 90 శాతం కాలిన గాయాలతో జిల్లా ఆసుపత్రిలో చేరి అనంతరం కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆయన తండ్రి అభిరామ్ తన కుమారుడుని మాజీ డీఎఫ్ఓ సంగ్రామ్ కేసరి బెహరా, తన కోడలు బిద్యా భారతి పండా, వంట మనిషి మన్మత్ కుంబో హత్య చేశారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెెలిసిందే. గత రెండు నెలల క్రితం సంగ్రామ్ కోర్టులో లొంగిపోయి విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తుండగా , ఈ మధ్యకాలంలో మన్మత్ ను అరెస్టు చేసి ఉపకారాగానికి తరలించిన సంఘటన తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలు అయినా బిద్యా భారతి పండా ఐదేళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ వస్తూ ఉండేది. అక్కడ బెయిల్ రద్దు చేయడంతో చివరకు జిల్లా కోర్టులో లొంగిపోయారు. ఎస్టీజేయం జడ్బీ గాయత్రి మిశ్రా పండా బెయిల్ పిటిషన్ రద్దుచేసి ఉపకారాగారానికి విచారణ ఖైదీగా తరలించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst