Hijack Alert: టేకాఫ్‌కు ముందు హైజాక్ అలర్ట్.. ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం..
Hijack Alert: కోల్‌కతా నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిరిండియా విమాన టాయిలెట్లో హైజాక్ బెదిరింపు సందేశం కలకలం రేపింది.
Hijack Alert: టేకాఫ్‌కు ముందు హైజాక్ అలర్ట్.. ఎయిరిండియా విమానంలో తీవ్ర కలకలం..
Hijack Alert: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాకు చెందిన ఒక విమానంలో ఒక్కసారిగా ‘హైజాక్ అలర్ట్’ రావడం తీవ్ర తీవ్ర కలకలానికి దారితీసింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి బయలుదేరేందుకు టేకాఫ్‌నకు సిద్ధంగా ఉన్న విమానం (Air India Flight)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత, టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు విమానంలోని ఒక టాయిలెట్లో ఉన్న అద్దంపై హైజాక్‌ను సూచించే బెదిరింపు సందేశం కనిపించినట్లు తెలుస్తోంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు.
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న పైలట్ తక్షణం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు హైజాక్ అలర్ట్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే స్పందించి విమాన టేకాఫ్‌ను నిలిపివేశారు. భద్రతా నిబంధనల ప్రకారం విమానాన్ని రన్‌వే నుంచి ఐసోలేషన్ (ప్రత్యేక తనిఖీ) ప్రాంతానికి తరలించారు.
విమానంలో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సహాయంతో విమానమంతటా ముమ్మర తనిఖీలు చేపట్టారు. బెదిరింపు సందేశాన్ని ఎవరు రాశారనే దానిపై స్థానిక పోలీసులు, భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.




