Amit Shah: గుజరాత్‌లో బీజేపీ గెలుపు.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్.!

Amit Shah: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై

G Krishna
Published on: 13 Oct 2026 8:05 PM IST
Amit Shah
X

Amit Shah: గుజరాత్‌లో బీజేపీ గెలుపు.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్.!

Amit Shah: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రజాదరణను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఎస్‌ఐఆర్ (SIR) అంశంతో ముడిపెట్టి మాట్లాడటం మానుకుని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై రాహుల్ గాంధీ ఆత్మమంచనం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అక్రమ చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ పార్టీకి కనీస పట్టులేదని, ఇదే తీరు కొనసాగితే రాబోయే ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఎద్దేవా చేశారు.

గుజరాత్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ డీలా పడ్డ పరిస్థితి

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని అమిత్ షా గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 41 సంవత్సరాలుగా ఒక్క ఎన్నికల్లో కూడా విజయం సాధించలేదని, చివరిసారిగా 1985లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందిందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తమ పూర్తి నమ్మకాన్ని నిరూపించారని తెలిపారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం స్థానాలకు గాను బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుందని, గత ఎన్నికలతో పోలిస్తే తమ పార్టీ ఓటు షేర్‌ను గణనీయంగా పెంచుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వంటి ప్రతిపక్షాలు ప్రతిచోటా డిపాజిట్లు కోల్పోయాయని అమిత్ షా ఎత్తిచూపారు.

పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఉపఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం

కేవలం గుజరాత్‌లోనే కాకుండా పశ్చిమ బెంగాల్ , పుదుచ్చేరి ప్రాంతాలలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలను కూడా అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక చతికిలబడిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లోని నావ్‌గావ్ , నందిగ్రామ్ వంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారని తెలిపారు. రేవ్‌నగర్‌లోనూ బీజేపీ ఘన విజయం సాధించగా, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించారని, కాంగ్రెస్‌కు మాత్రం నిరాశే మిగిలిందని అమిత్ షా పేర్కొన్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.