Amit Shah: మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 2029 నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం
Amit Shah: భాజపాకు ఒక్క అవకాశం ఇస్తే 2029 నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ. ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Amit Shah: మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 2029 నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం
Amit Shah: భారతీయ జనతా పార్టీకి (BJP) ఒక్క అవకాశం ఇస్తే 2029 డిసెంబరు 31 నాటికి పంజాబ్‌ను పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘నషా ముక్త్ పంజాబ్’ లక్ష్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామని ఆయన ప్రకటించారు. బుధవారం పంజాబ్‌లో పర్యటించిన అమిత్ షా.. జలంధర్‌లోని పరగ్‌పుర్‌లో నిర్వహించిన ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం రాష్ట్రంలో మత్తు పదార్థాలు స్వేచ్ఛగా విక్రయించేందుకు వీలు కల్పించిందని అమిత్ షా దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే యువత పెడదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్ము కశ్మీర్‌లోనూ నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని సమూలంగా నిర్మూలించామని గుర్తుచేశారు. అదే విధంగా ప్రజలు భాజపాకు ఒక్క అవకాశం ఇస్తే పంజాబ్‌ను కూడా మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మారుస్తామని భరోసా ఇచ్చారు.




