Amit Shah: మరో 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు అధికారం దక్కదు.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు!

Amit Shah: కాంగ్రెస్ నిరసనల వేళ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

Arun Chilukuri
Published on: 22 Oct 2026 3:41 PM IST
Amit Shah
X

Amit Shah: మరో 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు అధికారం దక్కదు.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు!

Amit Shah: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమి నిరసనలు, ధర్నాలు చేపడుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. ఢిల్లీ జల్ బోర్డ్‌కు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన వేదికగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనను ప్రస్తావిస్తూ ఆయనపై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

సభలో అమిత్ షా మాట్లాడుతూ.. "ప్రస్తుతం మీరు విదేశాల్లో కూర్చుని ఉన్నారు, కాబట్టి నా మాటలు మీకు నేరుగా వినపడవని నాకు తెలుసు. అసలు మీరు విదేశాలకు ఎందుకు వెళ్తారో ఎప్పుడూ చెప్పరు. సరేలే.. అది మీ వ్యక్తిగత విషయం, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఒకసారి విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత నా మాటను బాగా వినండి. రాబోయే 30 ఏళ్ల వరకు మీరు దేశంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు" అని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాలు చేపడుతున్న నిరసనలు, ధర్నాల వల్ల ఏమీ సాధించలేరని అమిత్ షా హితవు పలికారు. "ఢిల్లీలో ఒక కొత్త ఆట మొదలైంది. బీజేపీ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తుంటే 'ఓట్ల దొంగతనం' అని నెపాన్ని నెట్టేస్తున్నారు. అసలు చొరబాటుదారుల ఓట్లను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఈ రకమైన అసత్య ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు మంచివని, ఓడిపోతే కేంద్ర ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. ప్రతిపక్షాల ఈ ప్రతికూల రాజకీయాల వల్లే రాబోయే 30 ఏళ్ల వరకు వారు అధికారానికి దూరంగా ఉంటారు" అని అమిత్ షా స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.