Amruta Fadnavis: యోగా డేలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా సీఎం భార్య
Amruta Fadnavis: వర్లిలోని డోమ్ స్టేడియంలో దివ్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడ్నవీస్ నేతృత్వం వహించారు.
Amruta Fadnavis: యోగా డేలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా సీఎం భార్య
Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముంబైలో నిర్వహించిన ఒక ప్రత్యేక యోగా కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు, ఫిట్నెస్ ఫ్రీక్ షాహిద్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనదైన స్టైల్‌లో ఈ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు.
ముంబై వర్లిలోని ప్రసిద్ధ డోమ్ , ఎస్పీపీ స్టేడియంలో దివ్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఈ యోగా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త అమృతా ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ ఫిట్నెస్ ఈవెంట్‌లో అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజా ఫడ్నవీస్‌లతో కలిసి నటుడు షాహిద్ కపూర్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరితో కలిసి పలు యోగాసనాలు వేస్తూ ఇన్వెస్టర్లలాగే ఇటు హెల్త్ కాన్షియస్ ప్రజలనూ ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవీస్ తన చురుకైన భాగస్వామ్యంతో అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యోగా గొప్పదనాన్ని, భారతీయ సంస్కృతిని కొనియాడారు.
దివ్యాజ్ ఫౌండేషన్‌తో కలిసి ఇక్కడ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. యోగా ఎక్కడ పుట్టిందో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది అంతర్జాతీయ దినోత్సవం అయినప్పటికీ, మన దేశానికి ఇది చాలా పెద్ద రోజు. ఎందుకంటే యోగా అనేది మన పూర్వీకులు మనకు అందించిన భారతీయుల సొంత విద్య. ప్రతిరోజూ యోగా చేయడంతో పాటు, మన మూలాలను, మన ధర్మాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అని అమృతా ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఒక సామాన్య యోగా సాధకుడిలా కింద కూర్చుని ఆసనాలు వేయడం, అమృతా ఫడ్నవీస్ టీమ్ ఇచ్చిన సందేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతున్నాయి.




