Anant Singh: రూ.50 కోట్ల పెళ్లి వేడుక.. 4 లక్షల మంది అతిథులు.. 150 రకాల రాజభోజనం!

Anant Singh: బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఏ కార్యక్రమం నిర్వహించినా అది దేశవ్యాప్తంగా సంచలనమే అవుతుంది.

G Krishna
Published on: 13 Nov 2026 8:46 PM IST
Anant Singh
X

Anant Singh: రూ.50 కోట్ల పెళ్లి వేడుక.. 4 లక్షల మంది అతిథులు.. 150 రకాల రాజభోజనం!

Anant Singh: బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఏ కార్యక్రమం నిర్వహించినా అది దేశవ్యాప్తంగా సంచలనమే అవుతుంది. ఈసారి ఆయన కుమార్తె శివాంగి సింగ్ వివాహం అక్షరాలా ఒక రాజరిక వేడుకను తలపిస్తోంది. నవంబర్ 25న జరగనున్న ఈ మహా వివాహం రాజకీయ, సినీ వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది.

10 ఎకరాల భారీ పండాల్.. విదేశీ పూల అలంకరణ

అనంత్ సింగ్ తన పూర్వీకుల గ్రామమైన లధ్మాలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. సుమారు 4 లక్షల మంది అతిథులు హాజరవుతారన్న అంచనాతో 10 ఎకరాల విశాలమైన స్థలంలో అత్యాధునిక ఏసీ, వాటర్‌ప్రూఫ్ టెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి ప్రత్యేక కళాకారులు వచ్చి పండాల్‌ను అలంకరిస్తున్నారు. జైపూర్‌లోని జర్నలిస్ట్ స్క్వేర్ నమూనాలో 30 అడుగుల ఎత్తైన జైమాల వేదికను నిర్మిస్తున్నారు. దీనికోసం చైనా, బెంగళూరు నుంచి కోట్లాది రూపాయల విలువైన ఖరీదైన విదేశీ పూలను దిగుమతి చేసుకుంటున్నారు.

దేశవిదేశాల నుంచి ప్రముఖులు.. 150 రకాల రాజభోజనం

ఈ వేడుకకు అమెరికా, దుబాయ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, వీఐపీలు హాజరుకానున్నారు. బాలీవుడ్ నటులు సోనూ సూద్, భోజ్‌పురి స్టార్స్ పవన్ సింగ్, మనోజ్ తివారీ, అక్షర సింగ్ తదితరులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ దిగ్గజాలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఇక అతిథుల కోసం ఏకంగా 150 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. సాంప్రదాయ బీహారీ వంటకాలతో పాటు ఫైవ్-స్టార్ చెఫ్‌ల ఆధ్వర్యంలో డజన్ల కొద్దీ లైవ్ కౌంటర్లు, రాజరిక వంటకాలు వడ్డించనున్నారు.

గుర్రపు పందాలు.. రూ. 3 కోట్ల కారు కానుక

ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా భారీ గుర్రపు పందాలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచిన వారికి సుమారు రూ. 20 లక్షల విలువైన థార్ వాహనం, రెండవ స్థానానికి మోటార్ సైకిల్ బహుమతిగా ఇస్తున్నారు. అనంత్ సింగ్ స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, అమెరికాలో ఉంటున్న తన కాబోయే అల్లుడు రిషికేష్ కుమార్‌కు సుమారు రూ. 3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇస్తుండటం విశేషం.

రూ. 50 కోట్ల భారీ బడ్జెట్

ఈ వివాహ వేడుకకు మొత్తం మీద రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఖర్చవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంత భారీ మొత్తంలో ఖర్చు చేయడంపై వస్తున్న విమర్శలపై అనంత్ సింగ్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ఇందులో తన వ్యక్తిగత ఖర్చు చాలా తక్కువని, తన స్నేహితులు, శ్రేయోభిలాషులే అన్నీ చూసుకుంటున్నారని తెలిపారు. ఏది ఏమైనా, బీహార్ రాజకీయ చరిత్రలో ఈ 'బాహుబలి' ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి అత్యంత ఖరీదైన, వైభవవంతమైన వేడుకగా నిలవనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.