Annapurna Grain ATM: కొత్త పథకం ప్రారంభం..ఇక ఏటీఎం నుండే రేషన్ బియ్యం సరఫరా
Annapurna Grain ATM: రేషన్ దుకాణాల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు.
Annapurna Grain ATM: కొత్త పథకం ప్రారంభం..ఇక ఏటీఎం నుండే రేషన్ బియ్యం సరఫరా
Annapurna Grain ATM: ఇక రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ టైమ్‌లోనైనా నేరుగా ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేసినట్లే బియ్యం డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 'అన్నపూర్ణ గ్రెయిన్ ఏటీఎం' పేరుతో ఒక సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఏటీఎం నుంచి బియ్యం డ్రా చేయడం ఎలా? ఈ గ్రెయిన్ ఏటీఎంల నుంచి బియ్యం పొందడం చాలా సులభం. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో బియ్యం బయటకు వస్తాయి.ఏటీఎం మిషన్ స్క్రీన్‌పై మీ ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై వివరాలు వచ్చాక మీ వేలిముద్ర లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే, కార్డ్‌పై మీకు కేటాయించిన పరిమాణంలో బియ్యం ఆటోమేటిక్‌గా కింద ఉన్న కంటైనర్‌లోకి వచ్చేస్తాయి.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
రాయ్‌పూర్
దుర్గ్
బిలాస్పూర్
ఈ యంత్రాల ద్వారా లబ్ధిదారులు వారంలో 7 రోజులు, 24 గంటల పాటు తమకు వీలైన సమయంలో రేషన్ తీసుకోవచ్చు. ఈ పథకం కింద కేవలం ఛత్తీస్‌గఢ్ వాసులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అక్కడ పనిచేస్తున్న వలస కార్మికులు కూడా ఈ ఏటీఎంల ద్వారా ఉచిత రేషన్ పొందవచ్చు. రోజువారీ కూలీలు, ఉద్యోగులు పనుల వేళల్లో పీడీఎస్ షాపుల ముందు నిలబడాల్సిన అవసరం లేకుండా, డ్యూటీ ముగించుకుని రాత్రి వేళల్లో అయినా బియ్యం విత్‌డ్రా చేసుకోవచ్చు.సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ గ్రెయిన్ ఏటీఎంలు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నాయి.




