Bihar: బిహార్‌లో మరో అరాచకం: టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై ఆరుగురి దాడి.. అసభ్య ప్రవర్తన!
Bihar: బిహార్‌లో అమ్మాయిలపై వేధింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Bihar: బిహార్‌లో మరో అరాచకం: టూరిస్ట్ స్పాట్‌లో యువతిపై ఆరుగురి దాడి.. అసభ్య ప్రవర్తన!
Bihar: బిహార్‌లో అమ్మాయిలపై వరుసగా జరుగుతున్న వేధింపుల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే జాముయి, సమస్తీపుర్‌లో మైనర్ బాలికలపై ఆకతాయిల అఘాయిత్యాలు మరువకముందే.. తాజాగా బంకా జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
బాధితురాలితో ఆ ఆరుగురు వ్యక్తులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబరు 3న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను పరిశీలించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, నిందితుల గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవలి కాలంలో జాముయి జిల్లాలో కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వస్తున్న టీనేజర్లను అడ్డగించిన దుండగులు, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి బలవంతంగా లాక్కెళ్లారు.
మరో సంఘటనలో రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు దిగుతున్న టీనేజీ జంటను ఆకతాయిలు అడ్డగించి అమానుషంగా ప్రవర్తించారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఈ అఘాయిత్యాల పట్ల ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. బిహార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు మరియు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నాయి.




