రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగా 7 కేజీల బియ్యం.!
Antyodaya Ration Card: కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది.
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగా 7 కేజీల బియ్యం.!
Antyodaya Ration Card: పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు అందించే అంత్యోదయ అన్నయోజన స్కీమ్‌లో భారీ మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అంత్యోదయ రేషన్ కార్డుదారులకు భారీ ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలను సవరించి, లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కొత్త రూల్స్ తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అందులో ఉన్న సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో కీలక మార్పు చేస్తూ, ఇకపై కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి కచ్చితంగా 7 కిలోల చొప్పున రైస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొత్త నిర్ణయం అమలైతే ఎక్కువ మంది సభ్యులు ఉండే పెద్ద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటే వారికి ఏకంగా 42 కిలోల బియ్యం అందుతాయి.
త్వరలోనే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, సాధారణ రేషన్ కార్డులు కలిగిన ఇతర లబ్ధిదారులకు ప్రస్తుతం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. పేద కుటుంబాలకు మరింత ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే సామాన్యులకు ఉపశమనం లభించనుంది.




