Arvind Kejriwal: న్యాయస్థానానికి వెళ్లను.. గాంధీ మార్గంలో పోరాడతా: జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ!

Arvind Kejriwal: దిల్లీ మద్యం కేసులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణకు హాజరుకావడానికి అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, గాంధీ మార్గంలో పోరాడతానని ఆయన రాసిన లేఖ వివరాలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 27 April 2026 12:17 PM IST
Arvind Kejriwal
X

Arvind Kejriwal: న్యాయస్థానానికి వెళ్లను.. గాంధీ మార్గంలో పోరాడతా: జస్టిస్ స్వర్ణకాంత శర్మకు కేజ్రీవాల్ లేఖ!

Arvind Kejriwal: దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట విచారణకు హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని వివరిస్తూ న్యాయమూర్తికి కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు.

హైకోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే ఆశ లేదని కేజ్రీవాల్ తన లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. "వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ కోర్టుకు హాజరుకాను. ఇక్కడ విచారణ నిష్పక్షపాతంగా, తటస్థంగా జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. అందుకే మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేస్తాను" అని ఆయన వెల్లడించారు.

జస్టిస్ స్వర్ణకాంత శర్మ గతంలో ఇచ్చిన తీర్పును తాను సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సత్య మార్గం ఎప్పుడూ సులభం కాదని, గతంలోనూ తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆయన గుర్తు చేశారు. "జీవితంలో కొన్నిసార్లు కష్టమైన మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాను. గతంలో న్యాయస్థానాలు నన్ను నిర్దోషిగా ప్రకటించాయి, ఈసారి కూడా సత్యమే గెలుస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story