Chandrapur: ఆశ్రమ పాఠశాలలో దారుణం..80 మంది విద్యార్థులకు అరగుండు!

Chandrapur: మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఆశ్రమ పాఠశాలలో కటింగ్ చేయించుకోలేదనే కోపంతో 80 మంది విద్యార్థులకు అరగుండు చేయించిన ప్రిన్సిపాల్. తల్లిదండ్రుల ఆందోళన.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Oct 2026 3:15 PM IST
Chandrapur
X

Chandrapur: ఆశ్రమ పాఠశాలలో దారుణం..80 మంది విద్యార్థులకు అరగుండు!

Chandrapur: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆశ్రమ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులకు అరగుండు చేయించిన ఘటన కలకలం రేపింది.

విద్యార్థులకు కటింగ్ చేయించేందుకు పాఠశాల సిబ్బంది బార్బర్‌ను పిలిపించారు. అయితే కటింగ్ సమయంలో కొంతమంది విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో కటింగ్ చేయించుకోని సుమారు 80 మంది విద్యార్థులకు అరగుండు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన విద్యార్థుల అరగుండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు .స్పందించిన ఉన్నతాధికారులు.. ప్రిన్సిపాల్‌తో పాటు పాఠశాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.