Ayodhya: అయోధ్య రామ మందిర విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్!

Ayodhya: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాలకు సిట్ (SIT) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు సమాచారం.

Arun Chilukuri
Published on: 18 Aug 2026 12:16 PM IST
Ayodhya
X

Ayodhya: అయోధ్య రామ మందిర విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్!

Ayodhya: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అయోధ్య శ్రీరామ మందిర విరాళాల చోరీ ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రా కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ కేసులో ముమ్మర దర్యాప్తు జరిపిన సిట్ బృందం తన సమగ్ర నివేదికను ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యల కోసం దానిని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

శ్రీరాముడి ఆలయ విరాళాల లెక్కింపు సమయంలో నిధులు పక్కదారి పట్టాయని, చోరీ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గడిచిన జూన్ నెలలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు తమ తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని చంపత్ రాయ్ మొదటి నుంచీ స్పష్టం చేస్తూ వచ్చారు. సిట్ దర్యాప్తు నివేదిక బయటకు వచ్చిన తర్వాతే తాను పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఈ వివాదానికి ముగింపు పడినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story