Ayodhya: నవంబర్ 1 నుంచి అయోధ్య రాముడి దర్శన వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే!

Ayodhya: అయోధ్య శ్రీరాముని దర్శన వేళల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మార్పులు చేసింది.

Arun Chilukuri
Published on: 26 Oct 2026 11:47 AM IST
Ayodhya
X

Ayodhya: నవంబర్ 1 నుంచి అయోధ్య రాముడి దర్శన వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే!

Ayodhya: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ దర్శన వేళల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక మార్పులు చేసింది. వాతావరణంలో సంభవిస్తున్న సీజన్ మార్పులను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 1 నుంచి కొత్త దర్శన వేళలను అమల్లోకి తీసుకురానున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఆలయాన్ని ప్రతిరోజూ ఉదయం 4:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేయనున్నారు. ప్రస్తుతం ఆలయాన్ని తెల్లవారుజామున 3:45 గంటలకే తెరిచి, రాత్రి 10:30 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

రోజువారీ పూజలు - దర్శన వేళల పూర్తి వివరాలు (నవంబర్ 1 నుంచి):

ఉదయం 4:00 గంటలకు: ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.

ఉదయం 4:30 నుండి 4:40 వరకు: స్వామివారికి 'మంగళ హారతి' నిర్వహిస్తారు.

ఉదయం 4:40 నుండి 6:30 వరకు: అభిషేకం, శ్రీరాముని శృంగార హారతి మరియు ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాల కోసం ఆలయ ద్వారాలు మూసి ఉంటాయి.

ఉదయం 6:30 గంటల నుంచి: భక్తులకు స్వామివారి సాధారణ దర్శనం ప్రారంభమవుతుంది.

ఉదయం 8:00 నుండి 8:10 వరకు: 'బాలభోగ్' నైవేద్య సమర్పణ కోసం 10 నిమిషాల పాటు ఆలయం మూసివేస్తారు.

ఉదయం 8:10 నుండి 11:30 వరకు: భక్తులకు దర్శనం కొనసాగుతుంది.

మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు: 'రాజ్‌భోగ్' నైవేద్య సమర్పణ మరియు స్వామివారి విశ్రాంతి సమయం (ఆలయం మూసి ఉంటుంది).

మధ్యాహ్నం 1:35 గంటల నుంచి: మళ్లీ దర్శనాలు ప్రారంభమవుతాయి.

సాయంత్రం 6:00 గంటలకు: 'సంధ్యా హారతి' సమర్పణ (ఈ సమయంలో 15 నిమిషాల పాటు ద్వారాలు మూసి ఉంటాయి).

రాత్రి 10:00 గంటలకు: శయన హారతి అనంతరం ఆలయాన్ని రాత్రికి పూర్తిగా మూసివేస్తారు.

అయోధ్యకు వచ్చే భక్తులు ఈ కొత్త టైమింగ్స్‌ను గమనించి తమ ప్రయాణాలను, దర్శనాలను ప్లాన్ చేసుకోవాలని ఆలయ ట్రస్ట్ సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.