Banks WFH: మోదీ పిలుపుతో బిగ్ ఛేంజ్.. బ్యాంకులు ఇక ఇంటి నుంచే పని.!
Banks WFH: దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఫ్యూయల్ ఆదా చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ రంగం నుండి ఊహించని స్థాయిలో
Banks WFH
Banks WFH: దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఫ్యూయల్ ఆదా చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ రంగం నుండి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. సిటిజన్లు, ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని , ఆన్‌లైన్ మీటింగ్స్‌ను అలవాటు చేసుకోవాలని పీఎం మోదీ అప్పీల్ చేసిన వారం రోజుల్లోనే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ ఉద్యోగుల కోసం రిమోట్ వర్క్ , హైబ్రిడ్ వర్క్ పాలసీలను అనౌన్స్ చేశాయి. దీనితో పాటు కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ తమ ఖర్చులను తగ్గించుకోవాలని (ఆస్టెరిటీ మెజర్స్), అలాగే వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) వైపు షిఫ్ట్ అవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సరికొత్త డెసిషన్
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ లెండర్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తమ ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ కొత్త రూల్ బిజినెస్ ఎనేబ్లింగ్ ఫంక్షన్స్ , కార్పొరేట్ ఎనేబ్లింగ్ ఫంక్షన్స్‌లో పనిచేసే స్టాఫ్‌కు వెంటనే వర్తిస్తుందని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ అరేంజ్‌మెంట్ రాబోయే 30 రోజుల పాటు అమల్లో ఉంటుంది, ఆ తర్వాత పరిస్థితిని రివ్యూ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అయితే కస్టమర్లతో నేరుగా డీల్ చేసే అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లు యథావిధిగా పనిచేస్తాయని, కేవలం ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్‌రైటింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సర్వీసెస్, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ అండ్ కాంప్లియెన్స్ విభాగాల వారికే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.
ఇండస్ఇండ్ , యాక్సిస్ బ్యాంక్ హైబ్రిడ్ మోడల్
మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇండస్ఇండ్ (IndusInd) బ్యాంక్ కూడా మే నెల ప్రారంభంలోనే తమ ఉద్యోగుల కోసం హైబ్రిడ్ వర్క్ పాలసీని రోల్ అవుట్ చేసింది. టెల్లర్స్, బ్రాంచ్ మేనేజర్స్ లాంటి కస్టమర్ ఫేసింగ్ రోల్స్ మినహా మిగిలిన స్టాఫ్ అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ ఏడాది జనవరిలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద వారానికి ఒకటి, రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు ఉద్యోగుల నుండి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, ట్రావెలింగ్ టైమ్ తగ్గడం వల్ల వారు ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ హెల్త్ పై ఫోకస్ పెట్టగలిగారని బ్యాంక్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ (CHRO) అమితాబ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇక యాక్సిస్ (Axis) బ్యాంక్ అయితే 2021 ఆర్థిక సంవత్సరం నుంచే ఈ హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను మెయింటైన్ చేస్తోంది. నాన్-కస్టమర్ ఫేసింగ్ రోల్స్ లో ఉన్న ఉద్యోగులు వారానికి కేవలం రెండు రోజులు ఆఫీస్ కి వస్తే సరిపోయేలా వారి పాలసీ రన్ అవుతోంది.
ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీలకు కేంద్రం కఠిన రూల్స్
ప్రభుత్వ రంగ (PSU) బ్యాంకులు , ఇన్సూరెన్స్ కంపెనీల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం వీరికి నేరుగా వర్క్ ఫ్రమ్ హోమ్ మేండేటరీ చేయనప్పటికీ, ఖర్చులు , ఇంధన వినియోగం తగ్గించడానికి కఠినమైన ఆస్టెరిటీ ఆదేశాలను జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) లాంటి పెద్ద సంస్థలకు కీలక డైరెక్టివ్స్ ఇచ్చింది. ఇకపై అన్ని రకాల ఇంటర్నల్ రివ్యూలు, ఆపరేషనల్ కన్సల్టేషన్స్, పెద్ద కాన్ఫరెన్స్‌లను పూర్తిగా వీడియో కాన్ఫరెన్సింగ్ (VC) ద్వారానే నిర్వహించాలని ఆదేశించింది. దీనివల్ల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సీఎండీలు, ఎండీలు , సీఈఓల అనవసరమైన డొమెస్టిక్ , ఇంటర్నేషనల్ ట్రావెల్స్ తగ్గి ఇంధనం , డబ్బు భారీగా ఆదా అవుతాయని భావిస్తున్నారు.
ఈవీ వాహనాల వైపు వేగంగా అడుగులు
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో వాహనాల మార్పు అత్యంత కీలకమైన అంశంగా నిలిచింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల హెడ్ ఆఫీసులతో పాటు లోకల్ బ్రాంచ్‌లలో ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్, డీజిల్ రెంట్టెడ్ వెహికల్స్ స్థానంలో మెరుపు వేగంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) ను రీప్లేస్ చేయాలని గవర్నమెంట్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సేవ్ ఫ్యూయల్ అప్పీల్‌కు కేవలం బ్యాంకింగ్ రంగమే కాకుండా ఇప్పటికే సుప్రీంకోర్టు, పవర్ మినిస్ట్రీ, నాస్కామ్ (NASSCOM), జోహో (ZOHO) లాంటి సంస్థలు కూడా సపోర్ట్ చేస్తూ తమ పరిధిలో వర్క్ ఫ్రమ్ హోమ్, గ్రీన్ ఎనర్జీ ఆప్షన్స్ ను ప్రమోట్ చేయడం విశేషం. ఈ సరికొత్త లైఫ్ స్టైల్ , వర్క్ కల్చర్ మార్పుల వల్ల దేశంలో కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన దిగుమతుల భారం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.




