Karnataka Police: ఘోరం.. జైలు ఖైదీతో మహిళా ఇన్స్పెక్టర్ న్యూ*డ్ వీడియో కాల్.. క్లిప్ వైరల్

 Karnataka Police: బెంగళూరు నగరంలో శనివారం వెలుగులోకి వచ్చిన సంచలన ఉదంతం కర్ణాటక పోలీసు శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

CR Reddy
Published on: 22 Aug 2026 8:08 AM IST
 Karnataka Police
X

 Karnataka Police

Karnataka Police: బెంగళూరు నగరంలో శనివారం వెలుగులోకి వచ్చిన సంచలన ఉదంతం కర్ణాటక పోలీసు శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్, జైలులో ఉన్న రౌడీ షీటర్‌తో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. అందులో ఒక మహిళా పోలీస్ అధికారిణి, స్క్రీన్ అవతలి వ్యక్తితో మాట్లాడే క్రమంలో తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో క్లిప్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో బెంగళూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు వీడియోలో ఉన్న మహిళ ఎవరు, ఆ కాల్ అవతలి వైపు ఉన్న వ్యక్తి ఎవరనే కోణంలో సమగ్ర విచారణ చేపట్టారు.

రౌడీ షీటర్‌తో జైలు నుంచే శృంగార సంభాషణలు

పోలీసుల ప్రాథమిక విచారణలో మైండ్ బ్లాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీడియోలో ఉన్న సదరు మహిళ కర్ణాటక పారిశ్రామిక భద్రతా దళంలో ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. బెల్గాంలోని హిండల్గా సెంట్రల్ జైలులో పనిచేస్తున్న సమయంలో అక్కడ శిక్ష అనుభవిస్తున్న సాయికుమార్ అనే రౌడీ షీటర్‌తో ఈమెకు పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో ఆ పరిచయం కాస్తా సీక్రెట్ సంబంధానికి దారితీసింది. ఆ సమయంలోనే సదరు మహిళా అధికారిణి, జైల్లో ఉన్న సాయికుమార్‌తో నిత్యం వీడియో కాల్స్ మాట్లాడుతూ ఒంటిపై నూలుపోగు లేకుండా ప్రవర్తించినట్లు తేలింది.

రికార్డ్ చేసి నెట్‌లో వదిలిన ఖైదీ

మహిళా ఇన్స్పెక్టర్‌తో మాట్లాడిన ఆ శృం*గార సంభాషణలు, అసభ్యకర దృశ్యాలను సాయికుమార్ సీక్రెట్‌గా రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో సదరు రౌడీ షీటర్ ఆ వీడియో రికార్డింగ్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో సాయికుమార్, అతని అనుచరులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఖైదీతో ఇలా ప్రవర్తించడంపై పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story