Tourist places: చల్లని వాతావరణం, చిరు జల్లులు.. జూన్‌లో కచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాలివే
Tourist places: జూన్ నెలలో వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టడంఓత వెదర్ కూల్‌గా మారుతుంది.
Tourist places: చల్లని వాతావరణం, చిరు జల్లులు.. జూన్‌లో కచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాలివే
Tourist places: జూన్ నెలలో వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టడంఓత వెదర్ కూల్‌గా మారుతుంది. ఈ సమయంలో చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి, జలపాతాల అందాలు ఆస్వాదించాలనుకునే వారికి దేశంలో ఉన్న కొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లడఖ్ – మంచు పర్వతాల మధ్య అద్భుత ప్రయాణం
జూన్ నెలలో లడఖ్ పర్యాటకులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలో రహదారులు తిరిగి తెరుచుకుంటాయి. మంచు కరుగుతుండటంతో పర్వత మార్గాలు ప్రయాణానికి అనుకూలంగా మారతాయి.
ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 10°C నుంచి 25°C మధ్య ఉంటాయి. రాత్రి మాత్రం చలిగా ఉంటుంది. వర్షాలు చాలా తక్కువగా ఉండటం ప్రత్యేకత. లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు, నుబ్రా వ్యాలీ, హేమిస్ మఠం, థిక్సే మఠం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. బైకింగ్, ట్రెక్కింగ్, రోడ్ ట్రిప్‌లకు ఇది అత్యుత్తమ సమయం.
స్పితి వ్యాలీ – ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీని "మిడిల్ ల్యాండ్" అని పిలుస్తారు. జూన్‌లో ఇక్కడ దాదాపు 15 గంటలపాటు సూర్యకాంతి ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 10°C నుంచి 20°C మధ్య ఉండగా, రాత్రిపూట గడ్డకట్టేంత చలి ఉంటుంది. హిక్కిమ్ గ్రామంలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్, కీ మఠం, గ్యూ గ్రామంలోని సహజంగా భద్రపరిచిన మమ్మీ ప్రధాన ఆకర్షణలు. చంద్రతాల్ సరస్సు వద్ద క్యాంపింగ్ చేస్తూ రాత్రివేళ నక్షత్రాలను వీక్షించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది.
డార్జిలింగ్, షిల్లాంగ్ – మేఘాలు, వర్షాలు, పచ్చదనం కలిసిన అందాలు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ను "క్వీన్ ఆఫ్ ది హిల్స్" అని పిలుస్తారు. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. మేఘాలు, మంచు పొగమంచు, చల్లని గాలి ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఉష్ణోగ్రతలు 15°C నుంచి 23°C మధ్య ఉంటాయి. ప్రసిద్ధ టాయ్ ట్రైన్ ప్రయాణం తప్పక ఆస్వాదించాల్సిన అనుభవం. స్థానిక కేఫ్‌లలో వేడి థుక్పా, మొమోస్ రుచి చూడవచ్చు.
షిల్లాంగ్ – వర్షాల అందాలకు నిలయం
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జూన్‌లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. వర్షాల కారణంగా జలపాతాలు ఉప్పొంగుతాయి. కొండల మధ్య మేఘాలు తేలియాడుతూ అద్భుత దృశ్యాలను సృష్టిస్తాయి. చిరపుంజీ, డావ్కీ, మావ్‌ఫ్లాంగ్ పవిత్ర అటవీ ప్రాంతం, ప్రసిద్ధ లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఉష్ణోగ్రతలు 15°C నుంచి 27°C మధ్య ఉంటాయి.
ఊటీ – దక్షిణ భారతదేశంలోని చల్లని స్వర్గం
తమిళనాడులోని ఊటీ ఎప్పటికీ ప్రముఖ హిల్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. జూన్‌లో ఇక్కడ చల్లని గాలి, తేలికపాటి వర్షాలు, పచ్చని ప్రకృతి సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఉష్ణోగ్రతలు సాధారణంగా 18°C నుంచి 20°C మధ్య ఉంటాయి. నీలగిరి మౌంటైన్ రైల్వే ప్రయాణం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ టాయ్ ట్రైన్ కొండల మధ్య, సొరంగాల గుండా, పురాతన వంతెనలపై ప్రయాణిస్తూ అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఎమరాల్డ్ లేక్ చుట్టూ వాకింగ్, పైన్ అడవుల్లో విహారం, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ సందర్శన కూడా మంచి అనుభవాన్ని ఇస్తాయి.
జూన్‌లో సందర్శించదగిన మరిన్ని అద్భుత ప్రదేశాలు
* మనాలి (హిమాచల్ ప్రదేశ్) – మంచు పర్వతాలు, సాహస క్రీడలు.
* మున్నార్ (కేరళ) – పచ్చని టీ తోటలు, మేఘాలతో కప్పబడిన కొండలు ఆకట్టుకుంటాయి.
* కూర్గ్ (కర్ణాటక) – కాఫీ తోటలు, జలపాతాల అందాలు.
* గ్యాంగ్‌టక్ (సిక్కిం) – హిమాలయాల అందాలు, బౌద్ధ మఠాలు.
* నైనిటాల్ (ఉత్తరాఖండ్) – సరస్సులు, పర్వతాల నడుమ ప్రశాంత వాతావరణం.
* టావాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) – చల్లని వాతావరణం, బౌద్ధ సంస్కృతి.




