Maharashtra: భివండీలో విషాదం.. నాలుగంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి!
Maharashtra: మహారాష్ట్రలోని భివండీలో నాలుగంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి చెందారు.
Maharashtra: భివండీలో విషాదం.. నాలుగంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి!
Maharashtra: మహారాష్ట్రలోని భివండీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఒక నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోగా, సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన భవనంలో ఒక్కో అంతస్తులో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో నివాసితులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భవనం ఒక్కసారిగా కూలిపోయింది. భవనం నేలమట్టం కావడంతో అందులోని వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి కొందరిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల క్రితమే తీవ్రమైన పగుళ్లు ఏర్పడ్డాయని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. భవనం ప్రమాదకరంగా మారడంతో దానిని వెంటనే ఖాళీ చేయాలని నివాసితులకు ఇదివరకే సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ వారు ఖాళీ చేయకుండా అనధికారికంగా మరమ్మతు పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది ఆ మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.




