Samrat Choudhary: బీహార్ సీఎం సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు.. గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్!
Samrat Choudhary: బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు. నిందితుడు శేఖర్ యాదవ్‌ను గుజరాత్‌లో అరెస్ట్ చేసిన ముంగేర్ పోలీసులు. బీహార్ రాజకీయ పరిణామాలు.
Samrat Choudhary: బీహార్ సీఎం సామ్రాట్ చౌదరికి హత్యా బెదిరింపులు.. గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్!
Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ప్రాణహాని తలపెడతామంటూ వచ్చిన ఫోన్ కాల్ పోలీసు వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ బెదిరింపు కాల్‌పై బీహార్ పోలీసులు యుద్ధప్రతిపాదికన దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్ వచ్చిన మొబైల్ నెంబర్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ట్రాక్ చేశారు. నిందితుడు గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన ముంగేర్ పోలీసుల ప్రత్యేక బృందం వెంటనే అక్కడికి చేరుకుంది. గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో తలదాచుకున్న నిందితుడు శేఖర్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్‌కు తరలిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరపనున్నారు.
బీహార్ రాజకీయ చరిత్రలో కీలక మార్పుల తర్వాత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. బీహార్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడగా, సామ్రాట్ చౌదరి సీఎంగా ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ మార్పు సంభవించింది. జేడీయూ నుంచి ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్వయంగా 29 శాఖలను నిర్వహిస్తుండగా, జేడీయూకు 18 శాఖలు కేటాయించారు.




