Bihar Fake IAS Selection: యూపీఎస్సీకి ఎంపికయ్యానంటూ హాడావుడి.. కట్ చేస్తే.. సెలబ్రేషన్స్ తర్వాత దిమ్మతిరిగే ట్విస్ట్..

Bihar Fake IAS Selection: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025లో తాను ఆల్ ఇండియా ర్యాంక్ 440 సాధించానని ఓ యువకుడి చెప్పిన అబద్ధం బీహార్‌లో కలకలం రేపింది. గ్రామస్థులు ఘనంగా సన్మానాలు చేసి సంబరాలు జరుపుకోగా, నిజం బయటపడిన తర్వాత అందరూ షాక్‌కు గురయ్యారు.

Venkat
Published on: 14 March 2026 9:51 PM IST
Bihar Fake IAS Selection
X

Bihar Fake IAS Selection: యూపీఎస్సీకి ఎంపికయ్యానంటూ హాడావుడి.. కట్ చేస్తే.. సెలబ్రేషన్స్ తర్వాత దిమ్మతిరిగే ట్విస్ట్..

Bihar Fake IAS Selection: బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025లో తాను ఉత్తీర్ణుడినని, అంతేకాకుండా ఆల్ ఇండియా ర్యాంక్ 440 సాధించానని ప్రకటించాడు. ఈ వార్త అతని గ్రామం ఫతేహ్‌పూర్‌లో వేగంగా వ్యాపించింది. గ్రామస్థులు అతడిని తమ గ్రామ గర్వంగా భావించి, ప్రత్యేకంగా ఊరేగింపులు నిర్వహించి ఘన స్వాగతం పలికారు.

సన్మానాలు, నగదు బహుమతులు..

రంజిత్ కుమార్ చెప్పిన ఈ వార్తను నమ్మిన స్థానికులు మాత్రమే కాదు, కొంతమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు కూడా అతడిని సన్మానించారు. పూలమాలలు, బహుమతులు, నగదు ఇచ్చి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థులకు కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చని చెబుతూ రంజిత్ కుమార్ ప్రేరణాత్మక ప్రసంగాలు కూడా ఇచ్చాడు. దీంతో అతడి పేరు ప్రాంతంలో మరింత ప్రచారం పొందింది.

మెరిట్ లిస్టు చెక్ చేయడంతో బయటపడిన నిజం..

అయితే కొంతకాలానికే రంజిత్ కుమార్ చెప్పిన వివరాలపై అనుమానాలు మొదలయ్యాయి. అధికారిక యూపీఎస్సీ మెరిట్ లిస్టును పరిశీలించగా, ఆల్ ఇండియా ర్యాంక్ 440 బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్‌ది కాదని తేలింది. ఆ ర్యాంక్ కర్ణాటకకు చెందిన రంజిత్ కుమార్ ఆర్ అనే అభ్యర్థికి వచ్చినట్టు తెలిసింది. దీంతో గ్రామస్థులు, అతడిని సన్మానించినవారు అందరూ మోసపోయినట్టు స్పష్టమైంది.

ఫోన్ స్విచ్ ఆఫ్.. గ్రామం నుంచి అదృశ్యం..

ఈ విషయం బయటపడిన వెంటనే రంజిత్ కుమార్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఫతేహ్‌పూర్ గ్రామం నుంచి కనిపించకుండా పోయినట్టు సమాచారం. ప్రస్తుతం అతడిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

ప్రతిష్ఠ కోసం అబద్ధం..

ఈ ఘటన ప్రతిష్ఠ, పేరు కోసం కొందరు ఎంతదూరమైనా వెళ్లగలరనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ముఖ్యంగా ఉద్యోగాలు, పోటీ పరీక్షల విషయంలో అధికారిక సమాచారం ధృవీకరించకుండా నమ్మితే ఎలా తప్పుదోవ పడవచ్చో బీహార్ ఘటన స్పష్టం చేసింది. గ్రామస్థుల ఆనందం చివరకు అవమానంగా మారడం ఈ ఘటనలో అత్యంత బాధాకర అంశంగా నిలిచింది.

Next Story