Viral: ఎక్కడ దొరికారురా మీరు.! ఏకంగా 25 వేల వోల్టుల హై-టెన్షన్ వైర్లు చోరీ.!

Viral: బిహార్‌లో వింతైన చోరీ వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏకంగా 25,000 వోల్టుల హై-టెన్షన్ రైల్వే వైరును కత్తిరించి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా-గయా రైలు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Ravi
By Ravi
Published on: 10 July 2026 9:50 PM IST
Viral
X

Viral: ఎక్కడ దొరికారురా మీరు.! ఏకంగా 25 వేల వోల్టుల హై-టెన్షన్ వైర్లు చోరీ.!

Viral: పాట్నా-గయా రైలు మార్గంలో జరిగిన ఈ వింత చోరీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దొంగలు ఏకంగా 100 మీటర్ల పొడవైన 25,000 వోల్టుల హై-టెన్షన్ వైరును కత్తిరించి తీసుకెళ్లారు. రైల్వే ఆస్తుల భద్రతపై ఈ ఘటన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చోరీ కారణంగా సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

సుమారు 3 గంటల పాటు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. అత్యంత రద్దీగా ఉండే పాట్నా-గయా మార్గంలో రైళ్లు నడపడం రైల్వేలకు సవాలుగా మారింది. వైర్లు చోరీకి గురికావడంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి అధికారులు సింగిల్ లైన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది.

ఆర్పీఎఫ్ పోస్టుకు సమీపంలోనే ఇంత భారీ స్థాయిలో దొంగతనం జరగడం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. దొంగల తెగింపు చూసి అధికారులు కూడా షాక్ అవుతున్నారు. రైల్వే వ్యవస్థలో కీలకమైన హై-టెన్షన్ వైర్ల చోరీ వల్ల లక్షల విలువైన ఆస్తి నష్టంతో పాటు ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story