Parlakhemundi: పర్లాఖెముండిలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి!

Parlakhemundi: పర్లాఖెముండిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

S.Anil, Gajapati Dst
Published on: 26 Sept 2026 9:22 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి!

Parlakhemundi: సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా స్వాతంత్ర్య ఫలాలు అందాలని, అందుకోసం నిరంతరం పరితపించిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు అన్నారు.

ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని డోలె ట్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నారాయణరావు మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆయన సేవలు చిరస్పరిణీయమని , భావితరాలకు అనుచరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నబ కిషోర్ సబర్, జిల్లా కార్యదర్శి జగన్నాథ్ మహాపాత్ర్ , నాయకులు గేదెల శ్రీధర్ నాయుడు, కోడూరు జీవన్ రావు, పట్టణ ఉపాధ్యక్షులు రఘురాం రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst