Bomb Threat: చెన్నై నుంచి గోవా వెళ్లే విమానానికి బాంబ్ బెదిరింపు

Bomb Threat: చెన్నై మీనంబాక్కం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించి ఒక హెచ్చరిక తీవ్ర కలకలం సృష్టించింది.

CR Reddy
Published on: 20 Oct 2026 8:37 AM IST
IndiGo Flight
X

IndiGo Flight

Bomb Threat: చెన్నై మీనంబాక్కం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకు బయలుదేరాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించి ఒక హెచ్చరిక తీవ్ర కలకలం సృష్టించింది. అక్టోబర్ 19, 2026 సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానంలో మొత్తం 176 మంది ప్రయాణికులు అలాగే 6 మంది ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. టేకాఫ్‌కు ముందు జరగాల్సిన సాధారణ తుది తనిఖీలు పూర్తవుతున్న సమయంలో విమానంలో బాంబ్ ఉందనే విషయం వెలుగులోకి రావడంతో విమానాశ్రయ అధికారులతో పాటు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

టాయిలెట్‌లో లభించిన పేపర్ మెసేజ్

విమానం బయలుదేరే సమయం దగ్గర పడుతున్న తరుణంలో, విమానంలోని టాయిలెట్‌ను పరిశీలిస్తున్న ఒక ఫ్లైట్ అటెండెంట్‌కు అక్కడ ఒక చిన్న కాగితం కనిపించింది. ఆ కాగితంపై విమానంలో బాంబ్ పెట్టి ఉందనే విషయం రాసి ఉంది. వెంటనే అప్రమత్తమైన ఆ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనితో తక్షణమే స్పందించిన అధికారులు బాంబ్ డిటెక్షన్ అలాగే నిపుణుల బృందాన్ని రప్పించి విమానం అంతటా క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం ప్రారంభించారు.

ప్రయాణికులందరినీ కిందికి దించి తనిఖీలు

భద్రతా కారణాల దృష్ట్యా విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ అత్యవసరంగా కిందకు దించేశారు. ప్రయాణికులతో పాటు వారి లగేజీలను అలాగే సామాగ్రిని కూడా బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటలకు పైగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ సోదాల అనంతరం, విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అది కేవలం ఒక వదం మాత్రమేనని తేలింది. దీంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిందితుల కోసం గాలింపు

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన చెన్నై ఎయిర్‌పోర్ట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విమానం టాయిలెట్‌లో ఆ కాగితపు చిటికెను పెట్టింది ఎవరు అనే కోణంలో సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల జాబితాను సేకరించి విచారణ జరుపుతున్నారు. ఇలాంటి నకిలీ బెదిరింపులకు పాల్పడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.