Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేళ దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం..
Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందురోజు దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. దిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ విమానాశ్రయాలకు ఖలిస్థాన్ పేరిట ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది.
Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేళ దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం..
Bomb Threat: దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందురోజు రాజధాని దిల్లీలో తీవ్ర తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. దిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) సహా పలు ముఖ్యాంశ ప్రాంతాలను బాంబులతో పేల్చేస్తామంటూ శుక్రవారం బెదిరింపు మెయిల్ వచ్చింది. 'ఖలిస్థాన్' పేరిట దుండగులు ఈ ఈ-మెయిల్ పంపినట్లు పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
దిల్లీ హైకోర్టులో శనివారం మధ్యాహ్నం 2.11 గంటలకు బాంబు పేలుతుందని, ఆ తర్వాత ఇతర దిగువ కోర్టుల్లో వరుస పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఖలిస్థానీ వేర్పాటువాద సభ్యులు రాజధానికి చేరుకున్నారని హెచ్చరించారు. అంతేకాకుండా జామ్‌నగర్ హౌస్, ఝండేవాలన్ బిల్డింగ్, సాకేత్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫీస్, విమానాశ్రయం టర్మినల్-3, దిల్లీ మెట్రో, మరియు అంబాలా మార్గంలో వెళ్లే రైళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంతో దిల్లీ అంతటా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అమల్లో ఉన్నాయి. తాజా బెదిరింపు మెయిల్‌తో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. మెయిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్‌తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.




