Bihar Protest: బిహార్‌లో రగిలిన ‘బీపీఎస్సీ’ మంటలు.. పట్నాలో విద్యార్థుల భారీ ర్యాలీ, లాఠీఛార్జి!
Bihar Protest: బీపీఎస్సీ 70వ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ బిహార్‌లో విద్యార్థుల నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.
Bihar Protest: బిహార్‌లో రగిలిన ‘బీపీఎస్సీ’ మంటలు.. పట్నాలో విద్యార్థుల భారీ ర్యాలీ, లాఠీఛార్జి!
Bihar Protest: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు పట్నా వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. పట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు.
ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అభ్యర్థులు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేసి, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా, కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంతో లేదా విద్యాశాఖ మంత్రితో నేరుగా చర్చలు జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘విద్యార్థి సహయోగ శిబిరం’ పేరుతో ప్రతి నెలా నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విద్యార్థులు తమ ఫిర్యాదుల కోసం 1100 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.




