Gajapati: తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి అపహరణ!
Gajapati: ఒడిశా గజపతి జిల్లా కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు బంగారం, వెండితో పాటు రూ.3.60 లక్షల నగదును అపహరించారు.
Gajapati: తాళాలు పగులగొట్టి నగదు, బంగారం, వెండి అపహరణ!
గజపతి: కాశీనగర్ ఠాణా పరిధిలోని స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో నివసిస్తున్న ఏఆర్. లక్ష్మణ్ మూర్తి,హెచ్ పి పెట్రోల్ పంప్ దగ్గర నివసిస్తున్న మోహన్ దామోదర్ ఇళ్లలో చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అందిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం లక్ష్మణ్ మూర్తి తల్లి మరణించడంతో తన కుటుంబంతో కలిసి వేరే గ్రామానికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చి చూడగా ప్రధాన గేటు తాళంతో పాటు ఇంటి తాళాలు తెరిచి ఉండడం చూసి ఉలిక్కి పడ్డారు. ఇంట్లో తనిఖీ చేయగా సుమారు 2 కేజీల వెండి, 25 గ్రాముల బంగారం, సుమారు రూ.3 లక్షల నగదు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా హెచ్‌పి పెట్రోల్ పంప్ సమీపంలో కూడా దుండగులు ఇదే తరహాలో చోరీకి పాల్పడి మోహన్ దామోదర్ ఇంట్లో కూడా దొంగతనం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చొరబడి రూ.60వేల నగదు, సుమారు 150 గ్రాముల వెండిని దొంగిలించారు.
కాశీనగర్ ఠాణా అధికారి త్రినాథ్ సెఠి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ అలోక్ జగదాల, ఎఎస్ఐ ఆర్కే.చౌదరిల నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనల కారణంగా సామాన్య ప్రజల్లో తీవ్ర భయం నెలకొంది. రాత్రిపూట గస్తీని మరింత కఠినతరం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.




