Bengaluru: బెంగళూరులో దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి దారుణ హత్య!

Bengaluru: బెంగళూరులో ఘోరం కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన క్యాబ్ డ్రైవర్‌ను రాజాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Bengaluru
X

Bengaluru: బెంగళూరులో దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి దారుణ హత్య!

Bengaluru: కర్ణాటకలోని బెంగళూరులో ఘోరం జరిగింది. ఒకే కుటుంబంలో ఏడుగురు దారుణహత్యకు గురయ్యారు. ఇండుశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ తన భార్య, ఏడేళ్ల బాలుడితో సహా కుటుంబాన్ని హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో అనుమానిస్తున్నారు. బాధితులను ఒక్కొక్కరిని తన ఇంటికి రప్పించి, గ్రైండింగ్ రాయితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పడేసినట్లు సమాచారం.

రాజాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, హత్యల వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతులు సునీత, రూపవతి, శివకుమార్, శంకర్, దివ్య, నళిని, పునీత్‌గా గుర్తించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్