Twisha Sharma: సీబీఐ చేతికి నటి త్విషా శర్మ మృతి కేసు.. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం..
Twisha Sharma: నటి త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసును సీబీఐ (CBI) అధికారికంగా చేతుల్లోకి తీసుకుంది.
Twisha Sharma: సీబీఐ చేతికి నటి త్విషా శర్మ మృతి కేసు.. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం..
Twisha Sharma: అనుమానాస్పదంగా మృతి చెందిన నటి త్విషా శర్మ కేసు సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని విచారణకు సిద్ధమైంది. ఇవాళ భోపాల్‌కు చేరుకోనున్న విచారణ బృందం.. త్విషా గదిని పరిశీలింనుంది.
ఇక త్విషా కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేసును సీబీఐకి అప్పగించడాన్ని సమర్థించింది. విచారణపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. సీబీఐకి కేసు అప్పగించడం సరైన నిర్ణయమని తెలిపింది. సీబీఐ వెంటనే విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
మరోవైపు త్విషా భర్త లాయర్ కావడంతో.. కేసు విచారణలో కోర్టులు జోక్యం చేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. దీనిపై సీజేఐ స్పందించారు. కోర్టు విచారణను తప్పుదోవ పట్టించిందంటూ ఆరోపణలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో కోర్టుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.




