PNG Gas Connection Benefits: గ్యాస్ సిలిండర్‌కు గుడ్ బై.. సంచలన నిర్ణయంతో ఆ కష్టాలకు చెక్ పెట్టేసిన మోదీ ప్రభుత్వం..!
PNG Gas Connection Benefits: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
PNG Gas Connection Benefits: గ్యాస్ సిలిండర్‌కు గుడ్ బై.. సంచలన నిర్ణయంతో ఆ కష్టాలకు చెక్ పెట్టేసిన మోదీ ప్రభుత్వం..!
PNG Gas Connection Benefits: దేశవ్యాప్తంగా గ్యాస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, పైప్‌లైన్ గ్యాస్ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎల్పీబీ సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడం లేదా పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో, గృహ, వాణిజ్య అవసరాలకు పి.ఎన్.జి ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పి.ఎన్.జి ఎందుకు మేలు?
సిలిండర్ల కంటే పి.ఎన్.జి ఎంతో సురక్షితమైనది, సౌకర్యవంతమైనది. పైప్‌లైన్ ద్వారా నేరుగా వంటింట్లోకి గ్యాస్ రావడం వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. అలాగే, డెలివరీ చార్జీలు, బుకింగ్ ఇబ్బందులు తప్పుతాయి. ఇది దేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తుంది.
ఆన్లైన్లో కనెక్షన్ పొందడం ఎలా?
కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ నగరంలోని గ్యాస్ పంపిణీ సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి "కొత్త కనెక్షన్" విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత, సంస్థ ప్రతినిధులు మీ ఇంటికి వచ్చి కనెక్షన్‌ను ఏర్పాటు చేస్తారు.
కావలసిన పత్రాలు..
గుర్తింపు కార్డు: ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు.
చిరునామా ధృవీకరణ: విద్యుత్ బిల్లు, ఫోన్ బిల్లు లేదా ఇంటి పన్ను రశీదు.
ఇతరాలు: సొంత ఇల్లు అయితే దానికి సంబంధించిన పత్రాలు, అద్దె ఇల్లు అయితే యజమాని అనుమతి పత్రం (ఎన్.ఓ.సి), పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
ఖర్చులో ఏది తక్కువ?
సాధారణ ఎల్పిజి సిలిండర్‌తో పోలిస్తే పి.ఎన్.జి చాలా చౌకైనది. సిలిండర్‌లో మనం వాడినా వాడకపోయినా ముందే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పి.ఎన్.జిలో మనం ఎంత గ్యాస్ వాడితే అంతకే బిల్లు వస్తుంది. దీనివల్ల నెలవారీ బడ్జెట్లో ఆదా కనిపిస్తుంది. పైగా అత్యవసర సమయాల కోసం ఎల్పిజి కనెక్షన్‌ను కూడా బ్యాకప్‌గా ఉంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది.




