Parlakhemundi: గజపతి జిల్లాలో తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం!
Parlakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో అర్నబ్ తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం. కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్‌తో సమీక్ష సమావేశం నిర్వహించిన హోం మంత్రిత్వ శాఖ అధికారి.
Parlakhemundi: గజపతి జిల్లాలో తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం!
Parlakhemundi: అర్నబ్ తుపాను కారణంగా గజపతి జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పట్టణంలోని బెత్తగూడకు చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి రహదారి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేంద్ర బృందం అధ్యక్షుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి రవి శంకర్ (జెఎస్ డీఎం 1) అధ్యక్షతన సభ్యులు పట్నాకు చెందిన రైతు సంక్షేమ శాఖ, వరి అభివృద్ధి డైరెక్టర్ డాక్టర్ మాన్ సింగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి రాహుల్ చౌరాసియా (పి ఎఫ్ ఎస్), జల శక్తి శాఖ డైరెక్టర్ దిలీప్ కుమార్ జెనా, డిప్యూటీ డైరెక్టర్ కరణ్ సరేన్, జాతీయ రహదారుల సూపరింటెండెంట్ ఇంజనీరు సునీల్ కుమార్, గ్రామీణ అభివృద్ధి అండర్ కార్యదర్శి అజయ్ కుమార్ సాహు, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎస్ఆర్ఎస్సీ), ఇస్రో, అంతరిక్ష విభాగం సైంటిస్ట్ శ్రీ సాయి కృష్ణతోపాటు జిల్లా చీఫ్ జనరల్ మేనేజర్ సరోజ్ కుమార్ సాహు, విపత్తు నిర్వహణ శాఖ అదనపు కార్యదర్శి దిగాంత కుమార్ రౌత్రాయ్, దక్షిణ మండల ఆర్డీసీ విజయ్ అమృత కుళంగే పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ జిల్లాలో తుపాను కారణంగా సంభవించిన నష్టాలను బృందానికి వివరించారు. అనంతరం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి రవి శంకర్ మాట్లాడుతూ విపత్తు నిర్వహణ జిల్లాలో అధికారుల పనితీరును ప్రశంసించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ విధంగానే పనిచేసి జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.




