Air India Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన!
Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Air India Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన!
Air India Crash: గతేడాది 241 మంది ప్రాణాలను బలితీసుకున్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక విడుదలలో అలసత్వం వహిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ కేసు విచారణలో ఎటువంటి ఆలస్యం జరగలేదని, నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేసింది.
భారీ విమాన ప్రమాదాల దర్యాప్తు అనేక సాంకేతిక, పర్యావరణ అంశాలపై ఆధారపడి ఉంటుందని, అందుకే తుది నివేదిక సమర్పించడానికి నిర్దిష్ట గడువును ముందుగానే అంచనా వేయడం సాధ్యపడదని పౌర విమానయానశాఖ వెల్లడించింది.
ప్రమాదానికి దారితీసిన అన్ని సంభావ్య కారణాలు, ఇతర అంశాలను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపింది.
ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి విమాన ‘థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్’ను లోతుగా తనిఖీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని వెల్లడించింది.
గతేడాది అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలి 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందిన అత్యంత విషాదకర ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైన సంగతి తెలిసిందే.




