New Delhi: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు స్వాగతం పలికిన ఎంపీ!

New Delhi: అధికారిక పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఎంపీ బీద మస్తాన్ రావు, రాష్ట్రాభివృద్ధిపై స్వల్ప చర్చ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 July 2026 1:45 PM IST
New Delhi
X

New Delhi: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు స్వాగతం పలికిన ఎంపీ!

New Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై గౌరవ ముఖ్యమంత్రితో బీద మస్తాన్ రావు యాదవ్ స్వల్పంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో జరగనున్న సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ హౌస్‌కు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story