Chandrapur: సఫారీలో అరుదైన దృశ్యం.. చెట్టుపై చిరుత, రోడ్డుపై పులులు

Chandrapur: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జంగిల్ సఫారీలో పర్యాటకులకు ఒకేసారి చెట్టుపై చిరుతపులి, రోడ్డుపై రెండు పెద్దపులులు దర్శనమిచ్చి కనువిందు చేశాయి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 14 Nov 2026 10:17 PM IST
Chandrapur
X

Chandrapur: సఫారీలో అరుదైన దృశ్యం.. చెట్టుపై చిరుత, రోడ్డుపై పులులు

చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా కార్వా జంగిల్ సఫారీ బఫర్ జోన్‌లో వన్యప్రాణులు పర్యాటకులను కనువిందు చేశాయి. సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఒకే పర్యటనలో మూడు వన్యప్రాణులు కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

మొదట చెట్టుపై సేదతీరుతున్న చిరుతపులి పర్యాటకుల కంటపడింది. మరోవైపు అటవీ మార్గంపై రెండు పెద్దపులులు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో ఒకటి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, మరొకటి దర్జాగా కూర్చొని కనిపించింది. ఒకే సఫారీలో చిరుతపులితో పాటు రెండు పెద్దపులులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అరుదైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి ఆనందంగా గడిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.