Char Dham Yatra: భక్తులకు అలర్ట్.. చార్‌ధామ్ యాత్ర రెండు రోజులు బంద్!

Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో చార్‌ధామ్ యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేత. భక్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారుల హెచ్చరిక.

Arun Chilukuri
Published on: 28 July 2026 4:44 PM IST
Char Dham Yatra
X

Char Dham Yatra: భక్తులకు అలర్ట్.. చార్‌ధామ్ యాత్ర రెండు రోజులు బంద్!

Char Dham Yatra: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రకు తీవ్ర విఘాతం కలిగింది. వర్షాల ధాటికి యాత్రా మార్గాలు దెబ్బతినడం, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంగళ, బుధవారాల్లో యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేయడంతో పరిపాలనా యంత్రాంగం ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్షాలు తగ్గ ముఖం పట్టి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో పాటు దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

చార్‌ధామ్ యాత్ర కోసం బయలుదేరేందుకు సిద్ధమైన భక్తులు, యాత్రికులు పరిస్థితులు చక్కబడే వరకు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story