Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.
Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
Xi Jinping: బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి దిల్లీ చేరుకున్నారు. గత ఏడేళ్లలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేగాక, 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ వేదికగా ఇరు దేశాల నేతలు పాల్గొంటున్న తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడంతో సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నాలుగేళ్లకు పైగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి కీలక తరుణంలో భారత్ ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సదస్సులో భాగంగా నేడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ మధ్య ముఖాముఖి ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపుపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
భారత పర్యటనకు ముందు చైనా స్పందిస్తూ.. పొరుగు దేశాలతో స్నేహం, దీర్ఘకాల మైత్రిపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటూనే విభేదాలను పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నామని భారత్‌లోని చైనా రాయబారి గ్జు ఫీహాంగ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.
మరోవైపు, జిన్‌పింగ్ భారత పర్యటన వేళ చైనా కీలక ప్రకటన చేసింది. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ఆరేళ్ల విరామం తర్వాత సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ - దిల్లీ మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది.




