Kathua: జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల కలకలం - నలుగురు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు మృతి!
Kathua: కతువా జిల్లాలో సిబ్బంది మధ్య తలెత్తిన వివాదంతో రెచ్చిపోయిన హెడ్ కానిస్టేబుల్. సర్వీస్ వెపన్‌తో కాల్పులు జరపడంతో నలుగురు అధికారులు, జవాన్లు మృతి.
Kathua: జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల కలకలం - నలుగురు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు మృతి!
Kathua: జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. షిఫ్టుల మార్పు జరిగే సమయంలో CISF జవాన్ల మధ్య తలెత్తిన ఒక చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది. 2009 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అవధేష్ సింగ్ తన సర్వీస్ వెపన్‌తో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. సీఐఎస్ఎఫ్ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. సీఐఎస్ఎఫ్ డీజీ.. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు.




